Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్, విజయమ్మ రాజీనామా

సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ పదవికి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేశారు. ఇరు ప్రాంతాల్లో కాంగ్రెస్ డ్రామా ఆడుతోందని, అందుకు నిరసనగానే రాజీనామాలని సమాచారం. మరికొద్దిసేపట్లో విజయమ్మ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. అనంతరం మీడియా సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News